devotional | నేడు స్వస్తివాచకం పుణ్యవచనంతో ప్రారంభం

devotional | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి (18) ఈనెల 28 వరకు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ మాడవీధులను, అంతర ప్రాంగణాన్ని నీటితో శుద్ధి చేశారు. నేడు స్వస్తివాచకం పుణ్యవచనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
24న ఎదుర్కోళ్ల మహోత్సవం, 25న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం, 26న స్వామి వారి రథోత్సవం, 28న శతకటాభిషేకం నిర్వహించి ఉత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, నిత్య బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం కూడా నిర్వహించనున్నారు. అలాగే ప్రతిరోజూ 2500 మంది భక్తులకు ఉచిత అన్నదానం చేయనున్నారు.
