…వైభవంగా కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు…
కూరగాయలు ఆకుకూరలతో అలంకరణ…
పండ్లు కూరలు ఆభరణాలుగా సుందర స్వరూపం..
శోభాయమానంగా ప్రధాన,ఉపాలయాలు…
కన్నుల విందుగా అమ్మవారి అలంకరణ…2
4 టన్నులు కూరగాయలు విరాళం ఇచ్చిన రైతులు…
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లింపు..
భక్తులకు కదంభ ప్రసాదం పంపిణీ..
గంట గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ..
ఎన్టీఆర్ బ్యూరో – ఆంధ్రప్రభ, (NTR bureau )
శరణు.. శరణు.. శాఖాంబరి (sakambhari ) అంటూ ఆ కనకదుర్గమ్మ వారిని స్మరిస్తూ తరలివస్తున్న భక్త జన సంద్రోహంతో ఇంద్రగిరులు పులకరిస్తున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై (indrakiladri ) ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాకాంబరీ ఉత్సవాలు (celebrations ) అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ (kanakadurga ) వారికి పండ్లు వివిధ రకాల కూరలతో కనుల విందుగా అలంకరణ చేశారు. రైతులు, వ్యాపారస్తులు దాతలు విరాళంగా ఇచ్చిన సుమారు 24 టన్నుల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు పండ్లలతో అమ్మవారి ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, దేవాలయ ప్రాంగణం, మహా మండపం వివిధ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమ్మవారితోపాటు, ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను పండ్లు కూరగాయలతో అలంకరణ చేయడంతో ఆలయ ప్రాంగణమంతా స్వాభాయమానంగా కనిపిస్తోంది. ఇటు చూసిన హరిత వర్ణ శోభితమై కనిపిస్తున్న ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ అలముకుని ఉంది. శాకంబరీ దేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు బుధవారం భక్తుల పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వివిధ ప్రాంతాల గుండా తరలివస్తున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు పక్క జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పై ఉన్న క్యూ లైన్ లన్నీ కిక్కిరిసిపోయాయి. మదినిండా భక్తి పారవశ్యంతో, శాకాంబరీ దేవి అవతారంలో ఉన్న జగన్మాతను మనసారా కొలుస్తూ, అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు సైతం విస్తృత ఏర్పాటు చేశారు. దేవస్థానం అధికారులు సిబ్బందితోపాటు, సేవాదళ్ వాలంటీర్లు సైతం భక్తుల సేవలో తరిస్తున్నారు.
…. పరమ పవిత్రం కదంబ ప్రసాదం…
వివిధ పురాణాల్లో అమ్మవారి ప్రత్యేక రూపంగా శాకంభరీ దేవిగా పేర్కొన్న ప్రకారం, లోకంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు శ్రీ దుర్గాదేవి శతాక్షి గా అవతరించి కాయగూరలు, ఆకు కూరలు భక్తులకు అనుగ్రహించిన విధంగా – ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ వారి సన్నిధిలో శాకంభరీ ఉత్సవాలు 2007 నుండి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులు పాటు నిర్వహించే శాఖాంబరి ఉత్సవాల సందర్భంగా ఆలయ అలంకరణ, ప్రసాదం నిమిత్తం అవసరమైన కూరగాయలు రైతులు, వ్యాపారులు స్వచందంగా దేవస్థానంనకు విరాళముగా ఇస్తూ ప్రతి యేటా ఉత్సవాలు ఘనంగా జరగడానికి సహకరిస్తున్నారు. శాకంభరీ ఉత్సవాలు అనగానే బెజవాడ వాసులకు అమ్మ సన్నిధిలో వితరణ చేసే కదంభం ప్రసాదం భక్తుల స్మరణలో ఉంటుంది. కాయగూర ముక్కలు, బియ్యం, కందిపప్పు ప్రధాన దినుసులు గా సిద్ధం చేసే కదంభం ప్రసాదం ఈ మూడు రోజులు ఇంద్రకీలాద్రి పై ప్రత్యేకమని చెప్పవచ్చు. ఉదయం 6 నుండి రాత్రి 9 వరకు నిరంతరం భక్తులకు ఉచిత ప్రసాదం గా కదంభం ప్రసాద్ అన్ని అందిస్తున్నారు. భక్తులందరికీ అవసరమైన కదంబ ప్రసాద తయారీని కార్యనిర్వాహణాధికారి, వీకే శినా నాయక్ స్వయంగా పరిశీలిస్తూ దగ్గరుండి తయారు చేయిస్తున్నారు.