ఆలయంలో భక్తులు కిటకిట..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ (JubileeHills) లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు గజలక్ష్మీదేవీ (GajalakshmiDevi)గా పెద్దమ్మ తల్లి దర్శనం ఇచ్చారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన మండపంలో పెద్దమ్మ తల్లిని గజలక్ష్మీదేవీగా అలంకరించారు. పెద్దమ్మ తల్లి గుడిలో భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
