అమ్మవారికి వెండి బహుకరించిన భక్తులు..

అమ్మవారికి వెండి బహుకరించిన భక్తులు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్లోని శ్రీ ధనమైసమ్మ దేవాలయం మెట్ల బావి, అమ్మవారి వెండి కౌశం కొరకు 11500 /-రూపాయల విలువగల 50 గ్రాముల వెండిని తోట శ్రీపథ్ – అన్నపూర్ణ దంపతులు బహుకరించారు. మంగళవారం శివనగర్ వాస్తవ్యులు తోట శ్రీపథ్ – అన్నపూర్ణ పుణ్య దంపతులు వారి కుమారుడు శోనాద్రినాథ్ కోసం అమ్మవారిని కోరిన కోరిక వెంటనే తీర్చినందుకుగాను అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సుల కోసం శ్రీ ధన మైసమ్మ అమ్మవారి వెండి కౌశంకు 11,500 /- రూపాయల విలువ గల 50 గ్రాముల వెండిని ఆలయ అధ్యక్షులు తోట బాబన్నకి అందజేయడం జరిగింది.

అనంతరం తోట బాబన్న అమ్మవారి చిత్రపటం అందజేసి శాలువాతో దంపతులను సన్మానించారు. దాతల కుటుంబ సభ్యుల పై శ్రీ ధన మైసమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఉండి భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వెంకన్న, దాతలు, పాల్గొన్నారు.

Leave a Reply