బాసర సెప్టెంబర్ 13 ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 నిర్వహించే దేవి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని శనివారం హైదరాబాద్(Hyderabad) లోని నివాసంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)కు ఉత్సావ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా నవరాత్రి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్సవాలు వైభవంగా నిర్వహించలని భక్తులు సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నివాసంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్(MLA Rama Rao Patel) కు ఉత్సావ ఆహ్వాన పత్రిక అండదజేశారు.
వీరి వెంట ఆలయ ఈఓ అంజన దేవి, ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్,ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి,సామవేద పండితుడు నవీన్ శర్మ, మాజీ సర్పంచ్ రమేష్,తదితరులు పాల్గొన్నారు.

