ఎమ్మెల్యే పల్లా సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తా..

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ మున్సిపాలిటీ 16 వ వార్డులో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కల దేవి ఆకాంక్ష జోరుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటా వెళ్లి ప్రజల సమస్యలు వింటూ గెలిపిస్తే 16 వ వార్డును ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో మరింత అభివృద్ధి దిశగా పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో వార్డు ప్రజలకు సొంతింటికలను, తాగునీటి సమస్యను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను, వార్డుల మౌలిక వసతులను తీరుస్తామని, డోర్ టూ డోర్ ప్రచారంలో అభ్యర్థి ఎక్కలదేవి ఆకాంక్ష అన్నారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్కల దేవి ఆకాంక్ష గెలుపే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమం లో గులాబీ శ్రేణులు, పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave a Reply