అందరి సహకారంతోనే.. అభివృద్ధి

అందరి సహకారంతోనే.. అభివృద్ధి

గణపురం, (ఆంధ్రప్రభ):
ప్రజలు, అధికారులు అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జయశంకర్ జిల్లా ఘనపురం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న కాంపౌండ్ వాల్, షాపింగ్ మాల్ నిర్మాణ పనులకు జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్బంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. గాంధీనగర్ – జంగాలపల్లి రోడ్డుకు రూ. 20 కోట్ల నిధులు, హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు రూ. 18 కోట్ల నిధులతో సిడీఎఫ్ నిధులతో పాటు కేంద్ర, నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని కోటగుళ్ళు, రెడ్డిగుళ్లతో పాటు గణపురం టూరిజం అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనో కాటేజిలతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టేషన్ ఆవరణలో 2 ఎకరాల స్థలం ఉందని అందులో పోలీసుల క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్ రావు, సిఐ కరుణకర్ రావు, ఎస్సై రేఖ అశోక్, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply