Development | నిరుపయోగంగా పల్లె ప్రగతి వాటర్ ట్యాంకర్

Development | నిరుపయోగంగా పల్లె ప్రగతి వాటర్ ట్యాంకర్

  • పట్టించుకోని అధికారులు

Development | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి అభివృద్ధి(Development) కార్యక్రమలలో కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామ పంచాయతీకి మొక్కల పెంపకానికి, గ్రామంలో అత్యవసర నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ట్యాంకును కేటాయించింది. కానీ ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ అధికారుల పర్యవేక్షణ లేక మూలన చేరింది.

గ్రామ పంచాయతీకి సంబంధించిన వాటర్ ట్యాంకర్ గత కొన్ని నెలలుగా రోడ్డుపైనే పడి ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా కొందరు వాటర్ ట్యాంకర్‌(water tanker)ను ఉపయోగించుకొని రోడ్డుపైనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వాటర్ ట్యాంకర్ నిరుపయోగంగా ఉంచడం వల్ల సితిలావస్థకు చేరి ప్రజాధనం వృధా అవుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డు పక్కన నిరుపయోగంగా ఉన్న ట్రాక్టర్‌ వాటర్ ట్యాంకర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామంలో పారిశుధ్య పనులకు, నీటి సరఫరా కోసం వినియోగించాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

Leave a Reply