Development | అభివృద్ధిలో ఆదర్శం చేస్తా

Development | అభివృద్ధిలో ఆదర్శం చేస్తా

  • షాబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామచందర్

Development | షాబాద్, ఆంధ్రప్రభ : సర్పంచిగా తనను ఆశీర్వదిస్తే షాబాద్ మండల కేంద్రంను అభివృద్ధిలో ఆదర్శం చేస్తానని షాబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామచందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్(BRS) మద్దతు తో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రామచందర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను సర్పంచ్ గా ఆశీర్వదిస్తే షాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి(Development) చేస్తానని తెలిపారు. సేవ చేయాలని సదుద్దేశంతో సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు నిర్మాణం(CC roads) గావిస్తానని వివరించారు.

తాగునీటి సమస్య(drinking water problem) రాకుండా చూస్తూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మద్దతు దారులు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply