మహిళల అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహిళల అక్షరాస్యతతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని పగిడిమారి సర్పంచ్ మమ్మద్ జాఫర్ అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడిమారిలో అమ్మ అక్షరమాలఉల్లాస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలు పరిశీలించి సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటికి మహిళావెలుగని ప్రభుత్వం మంజూరు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలలో మహిళలకు పెద్దపీట వేస్తోందని విధిగా మహిళా చదువుకొని సంతకాలు నేర్చుకోవాలనిఅన్నారు.

సమాజ అభివృద్ధికి మహిళల అక్షరాస్యత ముడిపడి ఉందని ఆడపిల్లల చదువుఅవనికి వెలుగనిఅన్నారు. నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించి అక్షరాస్యత శాతాన్ని పెంచడంతోపాటు ప్రతి ఇంట్లో మహిళ చదవడం రాయడం నేర్చుకోవాలనిఅన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలకుఅక్షరాస్యతపై కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని 100 శాతం మహిళలు చదువుకోవాలన్నారు. చదువు సంస్కారంతోపాటు జీవోనోపాధి కుటుంబాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు ఓబిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply