జన్నారం, (ఆంధ్రప్రభ) : పట్టభద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పైడిపల్లి ఫంక్షన్ హాల్ లో గురువారం ఖానాపూర్ నియోజకవర్గస్థాయి ముఖ్య నేతల,కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కష్టపడి అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉండి పట్టభద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని, అలాంటప్పుడే అధిష్టానంలో తమ అందరికీ గుర్తింపు ఉంటుందని ఆమె చెప్పారు.
పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, పార్టీ ఎన్నటికీ కష్టపడ్డ కార్యకర్తలను,నాయకులను మరువలేదని ఆమె తెలిపారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని పట్టభద్ధులంతా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జీసీసీ రాష్ట్ర చైర్మన్ తిరుపతి,రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, పార్టీ పార్లమెంటు కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల,పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లంరవి, మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, నాయకులు రాజశేఖర్, మోహన్ రెడ్డి, ఇసాక్, సుభాష్ రెడ్డి, శంకరయ్య, కమలాకర్ రావు, రమేష్ రావు, రియాజొద్దీన్, సొహెల్ షా, కరుణాకర్, రమేష్, ఇందయ్య, అజ్మత్ ఖాన్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.