Development | అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

Development | అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా

  • ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి
  • ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మహిళలకు పెద్దపీట
  • 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ అభ్యర్థి తుమ్ముల నరేష్

Development | మంచిర్యాల, ఆంధ్రప్రభ : పాత మంచిర్యాల అభివృద్ధి చేసి రుణము తీర్చుకుంటానని మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. ఆదివారం తూముల నరేష్ సతీమణి జమున సతి సమేతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పుట్టి పెరిగిన పాత మంచిర్యాల 14వ డివిజన్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతుల ఆశీస్సులతో స్థానిక ఆలయాలలో పూజ కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా తూముల నరేష్ మాట్లాడుతూ… మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో చరిత్రలో నిలిచిపోయే విదంగా అభివృద్ధి పనులు జరుగుచున్నాయని మంచిర్యాల నియోజకవర్గం నాడు నేడు అనే విధంగా తెలంగాణలోని అభివృద్ధికి మారుపేరుగా రాష్ట్ర స్థాయిలో పేరును నమోదు చేసుకుందన్నారు.

జిల్లాలోని ప్రజల సంక్షేమం కొరకు మంచిర్యాల జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని అత్యాధునిక పద్ధతిలో నిర్మిస్తున్నారని, మంచిర్యాల పట్టణం గోదావరి ముప్పుతో అతలాకుతలం కావడంతో వందల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినప్పటికీ. గత ప్రభుత్వం, పాలకులు విస్మరించిన సందర్భాలలో నేనున్నానని వారికీ ప్రేమ్ సాగర్ అన్న భరోసాను కల్పించి ఎమ్మెల్యే గా ఆయన అనంతరం వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు చేయించి వేగవంతమైన టెండర్ ప్రక్రియతో కరకట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

వైకుంఠ దామం 100 రోజులలో పూర్తి చేసుకుని, పట్టణంలోని మార్కెట్ ఏరియాలో అంతర్గత మురుగు కాలువలు, విద్యుత్ లైన్లు నిర్మించేందుకు రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. విద్య, వైద్య రంగాలకు పెద్దపీఠ వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అభినందించే విధంగా మంచిర్యాల పటంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే అన్నారు.

పాత మంచిర్యాల ప్రజలు అన్నలు, అక్కలు, అవ్వలు, తాతలు అని నాపై ప్రేమతో మీరు చూపిస్తున్న అభిమానానికి జీవిత కాలం మీకు రుణపడి ఉంటాను అని మీ సేవకునిగా మీ ముందుకు వస్తున్నానని నేను పుట్టిన గడ్డ పాత మంచిర్యాల అడ్డా అని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని నాపై నమ్మకం ఉంచి మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply