హామీలు విస్మరించిన ఎమ్మెల్యే… రాజీనామా చేయాలి..

హామీలు విస్మరించిన ఎమ్మెల్యే… రాజీనామా చేయాలి..

మునుగోడు, ఆంధ్రప్రభ : ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మందుల సత్యం డిమాండ్ చేశారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ నుండి మునుగోడుకు కాలువల ద్వారా సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలపై ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరించడం, తొక్కిపట్టి నార తీస్తామని వారి అనుచరులు హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధిలో పూర్తిగా విఫలమైన రాజగోపాల్ రెడ్డి వెంటనే పదవి వీడాలని, ఉదయ సముద్రం, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందించలేకపోయినందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్ యాదవ్, నన్నూరి భూపతి రెడ్డి, మారగోని అంజయ్య గౌడ్, పొలగొని సైదులు గౌడ్, గజ్జల బాలరాజ్, జంగిలి సాంబయ్య, నల్గొండ అంజి, దెందే మల్లేష్, లింగస్వామి, జిట్టగొని మల్లేష్, బండారు శ్రీనివాస్, గుర్రాల సురేష్, లోకేష్, దోటి కరుణాకర్, పందుల సురేష్, రాంబాబు, యాదగిరి, నరసింహ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply