Development | ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరి వైపు?

Development | ఎమ్మెల్యే ఆశీస్సులు ఎవరి వైపు?
- స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ హీట్
- బీసీ మహిళ కోటాపై సస్పెన్స్
- ప్రజల్లో జోరుగా సాగుతున్న చర్చ
- వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ తారాస్థాయికి..
- రేపు (16న) ప్రమాణ స్వీకారం
Development | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిపై రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయిం చబడిన నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవిని బీసీ మహిళకు ఇవ్వాలనే ఆలోచన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వర్గాల్లో జరుగుతున్నట్లు సమా చారం. ముఖ్యంగా ముగ్గురు మహిళా కౌన్సిలర్లు పోటీలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో పట్టణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఫిబ్రవరి 16న వైస్ చైర్మన్ ప్రమాణ స్వీ కారం జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఎవరికి అవ కాశం దక్కుతుందన్నది రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
- ఎవరికీ వారు ప్రయత్నాలు:
12వ వార్డు కౌన్సిలర్ గట్టు సంగీత పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హతతో పాటు పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన కలిగిన నాయకు రాలిగా గుర్తింపు ఉందని తెలిసింది. అభివృద్ధి అంశాలపై సమగ్ర దృష్టి, ప్రజలతో నేరుగా మమేకమయ్యే శైలి ఆమె ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఆమె భర్త రమేష్‌కు రాజకీయ అనుభవం ఉండటం పరిపాలనా విష యాల్లో అవగాహన కలిగి ఉండటం సంగీతకు అదనపు బలంగా మారవచ్చని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
7వ వార్డు కౌన్సిలర్ అన్నెపు సుమలత కూడా పీజీ పూర్తి చేసిన విద్యా వంతురాలిగా ప్రజల్లో గుర్తింపు పొంది ఉంది. స్థానిక సమస్యలపై చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకె ళ్లడంలో ముందుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె పాత్ర ప్రభావవంతంగా ఉండవ చ్చనే ఊహాగానాలు రేసును మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.
11వ వార్డు కౌన్సిలర్ నీల రాజమ్మ మరో బలమైన పోటీదారుగా నిలు స్తున్నారు. ఆమె భర్త గట్టయ్యకు ఎమ్మెల్యే కడియం శ్రీహరితో సుదీర్ఘ అనుబంధం ఉండటం ఆమెకు కీలక ప్లస్ పాయింట్‌గా భావిస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత నాయకత్వంపై విశ్వాసం నీల రాజమ్మకు బలంగా ఉన్నాయని ఆమె అనుచరులు చెబుతున్నారు.
- ఈ ముగ్గురిలో ఎవరికీ అవకాశం దక్కేను?
రేపు (16న) జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. అధికారిక ప్రకటన వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగనుండగా.. పట్టణ ప్రజలు కూడా తుది నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్హత, రాజకీయ అనుభవం, స్థానిక అను బంధాలు, పార్టీ మద్దతు వంటి అంశాలు ఈ రేసులో కీలకంగా మార నున్నాయి. ముగ్గురిలో ఎవరు తుది నిర్ణయంలో పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎవరి ఖాతాలో పడుతుందన్నది రేపటితో తేలనుంది.
