రంజాన్ వేడుకల్లో పాల్గొన్న లలిత్ సాగర్

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న లలిత్ సాగర్
దర్శి, ఆంధ్రప్రభ : దర్శి పట్టణం కురిచేడు రోడ్ లోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ పురస్కరించుకొని వేలాదిగా ముస్లింలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలిత్ సాగర్ కు ముస్లిం సోదరులు సాధనంగా స్వాగతం పలికి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దర్శి పట్టణం లోని మక్కా మసీదు, నూర్ మసీదు, మదినా మసీదు ల అభివృద్ధి కి ఒక్కొక్క మసీద్ కి లక్ష రూపాయల చొప్పున 3 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తానని డాక్టర్ లలిత్ సాగర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అల్లా బషు, మౌలాలి, మున్సిపల్ చైర్మన్ నారాపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి మండల టీడీపీ అధ్యక్షుడు మరెళ్ల వెంకటేశ్వర్లు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు.
