Desires | భక్తిశ్రద్ధలతో….

Desires | భక్తిశ్రద్ధలతో….

Desires | రాప్తాడు, ఆంధ్రప్రభ : భగవంతుడు ఉన్నాడు అనేందుకు మన కళ్ళ ఎదురుగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే రాప్తాడు మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో వెలసిన శ్రీ నారాయణ స్వామి పాల పొంగులు అన్నదానం కార్యక్రమాలను గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఘనంగా వైభవంగా నిర్వహించామని పూజారి లింగమయ్య తెలియజేశారు.

ఈ సంవత్సరం ఎవరైనా కోరికలు కోరుకుంటే వచ్చే సంవత్సరానికి కచ్చితంగా నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు వేల సంఖ్యలో పాలపొంగులకు వస్తున్నారు. మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వేలల్లో భక్తులు వచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు మంచినీరు అన్నదానం చేశారు.

Leave a Reply