Deputy Speaker | పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్‌ను ప్రారంభం….

Deputy Speaker | పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్‌ను ప్రారంభం….

Deputy Speaker | కాళ్ళ, ఆంధ్రప్రభ : సంక్రాంతి పండుగ ఆటవిడుపు .. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పారామోటార్ ఏరియల్ అడ్వెంచర్ ప్రారంభించారు. తొలిసారిగా భీమవరంలో ఏర్పాటు చేవారు. సాంప్రదాయ పోటీలతో పాటు అడ్వెంచర్ రైడ్ ను కూడా భీమవరంకు (Bheemavaram) పరిచయం అయింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తొలి రైడ్ చేశారు. భ‌ద్రతా ప్రమాణాలతో రైడ్ సురక్షితంగా జ‌రిగింది. సంక్రాంతికి భీమవరం పట్టణ ప్రజలు, పట్టణానికి వచ్చిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. భీమవరంలో ఎన్నడూ లేని విధంగా సాంప్రదాయ పోటీలతో పాటు పారామోటర్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ ను కూడా తీసుకురావడం జరిగిందని, పట్టణ ప్రజలు, సంక్రాంతికి పట్నానికి వచ్చిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు.

ఈ రోజు జువ్వలపాలెం రోడ్డు పెద్ద అమీరం మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారా మోటర్ (Para Motor) ఎరైవల్ అడ్వెంచర్ స్కై రైడ్ ను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తొలి రైడ్‌ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సాహసోపేతంగా రైడ్ చేసి స్థానిక నాయకులను, ప్రజలను, యువతను ఉత్సాహపరిచారు.

Deputy Speaker | రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ…

ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ… భీమవరం ప్రజలకు, సంక్రాంతి సందర్భంగా భీమవరం విచ్చేసిన అతిధులకు సాంప్రదాయ పోటీలతో పాటు కొత్తగా పారా మోటర్ ఏరియల్ అడ్వెంచర్ ను పరిచయం చేస్తున్నామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలి ప్రయోగం జిల్లా కలెక్టర్ (Collector) రైడ్ తో ప్రారంభించడం జరిగిందని, ప్రజలను ఉత్సాహపరిచేందుకు, ఇటువంటి సాహస రైడ్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు తొలి రైడ్ మన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇది పూర్తిగా భద్రతతో కూడిన అడ్వెంచర్స్ రైడ్ అని తెలిపారు. ప్రజలు, చిన్నపిల్లలు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Deputy Speaker

Deputy Speaker | జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ…

భీమవరం అంటే కోడి పందాలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్ ని కూడా తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ ప్రజలతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు పారా మోటర్ ఏరియల్ రైడ్ ను (Ride) అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెలిపారు. నేను తొలి రైట్ ను చేయడం జరిగిందని ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉందని ఇది మంచి అనుభవం అన్నారు. సాంప్రదాయ ఆటల పోటీలతోపాటు ప్రజలు ఇటువంటి రైట్స్ లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. భూమి మీద నుండి అత్యధికంగా 600 మీటర్ల ఎత్తులో రైడ్ చేయవచ్చునని, నాలుగు స్కై రైడర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6:00 వరకు రైడ్స్ నిర్వహించడం జరుగుతుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ (Chairmen) జుత్తుగ నాగరాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏ.వెంకట అప్పారావు, ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ యాజమాన్యం పి.అమర్నాథ్, బి.ప్రవీణ్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO RAED MORE ఆటల పోటీల్లో నారా దేవాన్ష్‌కు మొదటి బహుమతి

CLICK HERE TO READ MORE

Leave a Reply