Deputy Sarpanch | ముత్యాల సునీల్ కుమార్ తో బాబాపూర్ సర్పంచ్ భేటీ

Deputy Sarpanch | ముత్యాల సునీల్ కుమార్ తో బాబాపూర్ సర్పంచ్ భేటీ

Deputy Sarpanch | భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండల్ బాబాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎంఏ. సమీర్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్ బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇవాళ‌ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్‌ను బాబాపూర్ నూతన సర్పంచ్ ఎంఏ.సమీర్ నాయకులతో పెళ్లి మ‌ర్యాదపూర్వ‌కంగా కలిశారు.

అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సమీర్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈసందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ… ఐదేళ్లపాటు చక్కని పాలన గ్రామ ప్రజలకు అందించి.. వారి మన్న‌న‌లు పొంది ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సయ్యద్ నవీద్, అన్ని వార్డ్ ల వార్డ్ మెంబర్, మైనార్టీ నాయకులు ఆమీర్, కలీం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply