AP | డిప్యూటీ సీఎం పవన్ కు అస్వస్థత.. విశ్రాంతి అవసరమన్న వైద్యులు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ వైరల్ ఫీవర్ కారణంగా రేపు (గురువారం) జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవచ్చని డిప్యూటీ సీఎం కార్యాలయం తెలిపింది.