అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. జూలై 27, సెప్టెంబర్ 1 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను (గురువారం) ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది.
కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు ఓ ప్రకటన విడుదల చేస్తూ, అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ http://www.psc.ap.gov.in లో చూసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్ల ద్వారా రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.
డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు, పదోన్నతుల కోసం అవసరమయ్యే అర్హత పరీక్షలుగా నిర్వహిస్తారు.