Democrats | బీఆర్ఎస్ కార్యకర్త హత్య దుర్మార్గం

Democrats | బీఆర్ఎస్ కార్యకర్త హత్య దుర్మార్గం
- ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాజకీయ కక్షలు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ నేతలు
- పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విఘాతం లేకుండా శాంతిభద్రతలు
- రాజకీయ హత్యలు పోలీసుల వైఫల్యమే
- ప్రజలు తిరుగుబాటుకు గురైతే పోలీసులదే బాధ్యత
- ఉప్పల మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Democrats | సూర్యాపేట, ఆంధ్రప్రభ: తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్లు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ఉప్పల మల్లయ్యను హత్య చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(General Hospital)లో మల్లయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు అదుపులో లేకుండా రాజకీయ కక్షలు పెచ్చుమీరుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక గ్రామాల్లో రాజకీయ కక్షలను కాంగ్రెస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదటి నుండి కాంగ్రెస్ పార్టీది దుర్మార్గ రాజకీయమని, వర్గ విభేదాలు సృష్టించుకోవడమే కాకుండా ఇతర పార్టీ నాయకులను హత్య చేయడం వారికి మొదటి నుండి అలవాటన్నారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో రాజకీయ కక్షలు, వివాదాలు లేకుండా శాంతిభద్రతలు ఫరి ఢవిల్లాయన్నారు.
పోలీసులు(Police) కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులను భయపెట్టడం సరికాదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, అదే తరహాలో సూర్యాపేట జిల్లాలో సైతం కొనసాగుతున్నాయన్నారు. డిజిపి స్వయంగా పర్యవేక్షణ చేసి శాంతి భద్రతలు అదుపులో చేయాలన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పోలీసులదే బాధ్యత అన్నారు.
ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోకపోతే నల్లగొండ, సూర్యపేట జిల్లాలు రావణ కాష్టంగా మారే ప్రమాదం ఉందన్నారు. బిఆర్ఎస్ నేతలకు రక్షణ కల్పించాలని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. జిల్లాలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు(Democrats), సామాజిక కార్యకర్తలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని, దుర్మార్గ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మల్లయ్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు రావడం లేదని, త్వరలోనే మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్తారని చెప్పారు. ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రజాక్, ఆకుల లవకుశ, బాషా తదితరులు ఉన్నారు.
