Democracy | అసత్య ఆరోపణలు నమ్మొద్దు

Democracy | అసత్య ఆరోపణలు నమ్మొద్దు
Democracy | చిట్యాల, ఆంధ్రప్రభ : నేరడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో(elections) ఏకగ్రీవం అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. భారతీయ జనతాపార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాసోజు శంకరాచారి(Kasoju Shankaracharya) ఆ వార్తల్లో నిజం లేదని, ప్రజాస్వామ్యం(Democracy) అంటేనే పోటీ అని, ప్రజలకు మేలు చేయాలంటే పోటీ ఉండాల్సిందేనని అన్నారు.
తాను బరిలో దిగుతున్నానని, కచ్చితంగా పోటీ చేస్తున్నానని, వెనకడుగు వేసేది లేదన్నారు. తనను కుమ్మక్కు రాజకీయాల(politics)కు ప్రతినిధిగా చూపుతున్న వారికి సరైన సమాధానం ప్రజలు ఓటు ద్వారా చెబుతారని, కచ్చితంగా బరిలో నిలిచి, గెలిచి సత్తా చాటుతానని ఆయన అన్నారు. నేరడ గ్రామానికి కేంద్రం నిధులు సక్రమంగా అందేలా చేసి, అభివృద్ధి పథంలో తీసుకు వెళతానని అన్నారు.
