హామీలు అడిగితే అరెస్టులా..?

హామీలు అడిగితే అరెస్టులా..?
- ఆరవ గ్యారెంటీ అమలు చేయాలని డిమాండ్
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; ఉద్యమకారుల అరెస్టులపై బీజేపీ జిల్లా కార్యదర్శి తడక అశోక్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం అన్యాయమని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఆరవ గ్యారెంటీ కింద పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వారిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. వెంటనే అరెస్టులు ఆపి ఉద్యమకారులకు గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం మళ్లీ ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు.
