రబీ పంటలకు భారీ నష్టం

రబీ పంటలకు భారీ నష్టం

  • వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

కడెం, ఆంధ్రప్రభ : ఈనెల 30న కురిసిన అకాల వడగండ్ల వానతో రబీ పంటలు తీవ్రంగా నష్టపోయాయని, బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బహుజన కూలి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల వెంకన్న డిమాండ్ చేశారు.

మంగళవారం కడెం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న, మామిడి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పసుపు ఉడకబెట్టి ఆరబోసిన పంటలు కూడా వర్షానికి తడిసి నష్టపోయాయని పేర్కొన్నారు.

కరీంనగర్, జగిత్యాల్, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారికి సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిస్థితులు మరింత దిగజారితే రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని, లేనిపక్షంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద రైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Leave a Reply