Delhi | ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Delhi | ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లకు హాజరుకాకపోవడంపై ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేస్తూ, ట్రయల్ కోర్టుకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఈ పరిణామం కేసులో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు.
