WPL 2025 | ఢిల్లీ, గుజరాత్ మధ్య కీలక పోరు… టాస్ గెలిచిన క్యాపిట‌ల్స్ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మహిళల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు ఐదు జ‌ట్లు ఐదు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న(సోమవారం) ఆర్సీబీ – యువీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో డ‌బ్ల్యూపీఎల్ చ‌రిత్ర‌లోనే తొలి సూపర్ ఓవర్ జరిగింది.

కాగా, ఈరోజు మరో ఉత్కంఠ మ్యాచ్ కు తెర‌లేవ‌నుంది. ఈరోజు బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లో… పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ – గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఉత్కంఠ పోరులో… ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని… గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

అయితే, నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానానికి ఎగబాకాలని చూస్తోంది. మరోవైపు, రెండు పాయింట్లతో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన‌ గెలిచి పాయింట్ల పట్టికలో మరో అడుగు ముందుకు వేయాలని ఉవ్విళ్లూరుతోంది.

జట్టు మార్పులు:

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు : ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన 18 ఏళ్ల పేసర్ టైటాస్ సాధు (టీమిండియా)… స్పిన్నర్ అరుంధతి రెడ్డి స్థానంలో తుది జట్టులోకి వ‌చ్చింది.

గుజరాత్ జెయింట్స్ : ఫోబ్ లిచ్‌ఫీల్డ్, భారతీ ఫుల్మాలి మరియు మేఘనా సింగ్ తుది జట్టులో ఉండగా, లారా వోల్వార్డ్, దయాళన్ హేమలత, సయాలీ సత్‌ఘరేలకు విశ్రాంతి ఇచ్చారు.

తుది జ‌ట్లు :

ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ : షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మారిజాన్ కాప్, జెస్ జోనాసెన్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీప‌ర్), నికి ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, టిటాస్ సాధు.

గుజరాత్ జెయింట్స్ ఉమెన్ : బెత్ మూనీ (వికెట్ కీప‌ర్), హర్లీన్ డియోల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, భారతీ ఫుల్మాలి, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా, మేఘనా సింగ్.

Leave a Reply