
Defection: 10 MLAs | ఆ తీర్పు కోరితేనే… నైతికీయం!
Defection: 10 MLAs | ఆ తీర్పు కోరితేనే… నైతికీయం!
- గెలుపోటములు కాదు, నైతికత కావాలి.
- ప్రజలు గమనిస్తున్నారు.
- హుందాగా వ్యవహరించాలి.
- ఫిరాయింపులు ఎప్పటికైనా ఆమోదయోగ్యం కాదు.
- గెలిచేదొక పార్టీ నుంచి, దూకేది మరో పార్టీలోకా?
Defection: 10 MLAs | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రజాప్రతినిధులు న్యాయవ్యవస్థ, రాజ్యాంగ పదవుల్లో ఉండే వారి తీర్పు కంటే ప్రజల తీర్పు(People’s verdict) కోరితేనే నైతికతగా ఉంటుందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుడు నైతిక విలువలు పాటించి చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు.
ఈ నైతిక విలువలు ఏ చట్టమో, ఏ రాజ్యంగమో చెప్పదు. అది కేవలం వ్యక్తిగతానికి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యం, నైతిక విలువ కోసం ప్రజలు చర్చించుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపు(Party defection) అనే చర్చ ఒకటి సాగుతోంది. గతంలో పార్టీ ఫిరాయింపులు జరిగినా ప్రస్తుతం బీఆర్ఎస్ పోరాటంతో దీనిపై చర్చ జోరుగా చర్చ జరుగుతోంది.
Defection: 10 MLAs | ఫిరాయింపు నిరోధకచట్టం ఏం చెబుతుందంటే

దేశంలో ఫిరాయింపు నిరోధక చట్టం(యాంటీ డిఫెక్షన్ లా)ను అధికారికంగా రాజ్యాంగం పదవ షెడ్యూల్(Tenth Schedule of the Constitution)గా పిలుస్తారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీలు మారడం(ఫిరాయింపు) వల్ల రాజకీయ అస్థిరత ఏర్పడకుండా నిరోధించడానికి తీసుకొచ్చిన చట్టం. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులకు వర్తిస్తుంది.
ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీ లోకి మారితే అనర్హత (డిస్‌క్వాలి ఫికేషన్) విధించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం, ఎన్నికైన సభ్యుడు తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని(Party membership) (మరో పార్టీలో చేరడం లేదా రాజీనామా చేయడం) ద్వారా స్వచ్ఛందంగా వదులుకుంటే ఈ అనర్హత వర్తిస్తుంది. అదే విధంగా పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించడం(పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటువేయడం లేదా అసలు ఓటువేయకుండా ఉండటం), పార్టీ 15 రోజుల్లో క్షమించకపోతే అనర్హత వేటుపడే అవకాశాలు ఉంటాయి.
స్వతంత్రంగా ఎన్నికైన సభ్యులు ఎన్నిక తర్వాత పార్టీలో చేరితే, నామినేటెడ్ సభ్యులు 6 నెలల తర్వాత పార్టీలో చేరితే కూడా అనర్హత వర్తిస్తుంది. అయితే పార్టీ ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన(Elected as party public representatives) వారిలో 2/3 మంది సభ్యులు అంగీకరించడం ద్వారా మరో పార్టీలో విలీనమైతే అనర్హత పడే అవకాశాలు ఉండవు. స్పీకర్, డిప్యూటీ- స్పీకర్ లేదా చైర్మన్ పదవిని తీసుకున్నప్పుడు పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు లెక్కించే అవకాశం ఉండదు.
కేంద్రంలో గానీ, ఏ రాష్ట్రం లోనైనా రాజకీయ స్థిరత్వాన్ని(Political stability) కాపాడటం, హార్స్ ట్రేడింగ్ తరహాలో ఎమ్మెల్యేల కొనుగోళ్లను అరికట్టడం, ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన పార్టీని గౌరవించడం వంటివి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు. అయితే 1985లో చట్టం చేసిన తరువాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్పులు చేశారు.
Defection: 10 MLAs | ఆ పది మందిపై బీఆర్ఎస్ పోరాటం…
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు
దానం నాగేందర్ (ఖైరతాబాద్),
కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్),
తెల్లం వెంకట్రావు (భద్రాచలం),
పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ),
ఎం.సంజయ్ కుమార్(జగిత్యాల),
అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి),
టి.ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్),
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల),
గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్ చెరు),
కాలె యాదయ్య(చేవెళ్ల)
కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిని అనర్హతగా గుర్తించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో పది మంది ఎమ్మెల్యేలు చేరారని, వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సుమారు ఏడాదిన్నర(A year and a half)గా పోరాటం చేస్తోంది. ఒక వైపు ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటీషన్ ఇస్తూ, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
Defection: 10 MLAs | రాజీనామా చేయడమే ఉత్తమం…

సుప్రీంకోర్టు సూచన మేరకు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రెడ్డి తీర్పు ఇచ్చారు. పది మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్(Speaker) కొట్టివేశారు. అందుకు తగిన ఆధారాలు లేవని అంటూ పిటీషన్‌ను స్పీకర్ ప్రసాద్ నిర్ణయం ప్రకటించారు. ఒక చట్ట సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎమ్మెల్యే రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) రూపొందించిన చట్టాన్ని ఆ పార్టీ గౌరవించకపోతే ఎలా అని పలువురి ప్రశ్న.
చట్టాన్ని గౌరవించకపోయినా, నైతిక విలువలైనా పాటించాలి కదా అనేది కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తరుఫున ఎన్నికైన పదిమంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్‌లో చేరారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ప్రజల్లో చర్చకు దారి తీసిన అంశం. ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్(Speaker Prasad) కేసు కొట్టివేయడం సమంజసమే. న్యాయమూర్తులు గానీ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు గానీ ఆధారాల మేరకే తీర్పును వెల్లడిస్తారు. వారి తీర్పులను ఎవరూ తప్పు పట్టలేరు.
కానీ బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్నది బీఆర్ఎస్ శ్రేణుల(BRS ranks) వాదన. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరినట్లు ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ చెబుతుంది. బీఆర్ఎస్ ఎన్నికైన దానం కాంగ్రెస్‌లో చేరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. అలాగే కడియం శ్రీహరి(Kadiyam Srihari) తన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి పోటీ చేశారు. కుమార్తె కావ్య తరుఫున కడియం శ్రీహరి ప్రచారం చేశారు.

వీరికి సంబంధించి సాక్ష్యం ఉన్నందున వారిద్దరూ రాజీనామా చేయక తప్పదని గట్టిగా బీఆర్ఎస్ నమ్ముతుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఒత్తిడి పెంచారు. ప్లెక్సీలు చింపివేశారు. స్పీకర్ తీర్పు, కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల తీర్పు(People’s verdict) కోరితే వారిని ప్రజలు గౌరవవిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ పది మంది ఏమి చేస్తారో చూడాలి మరి.
