వికారాబాద్, మే 17 ( ఆంధ్రప్రభ): కుక్కల దాడిలో జింక మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మంచినీళ్లు తాగడానికి దామగుండం పుష్కరిణి వద్దకు వచ్చిన జింకను కుక్కలు వెంటాడడంతో అక్కడికక్కడే మరణించింది.
ఈ ఘటనపై స్థానిక సాదు సత్య నందు మాట్లాడుతూ.. గత కొంతకాలంగా జింకలకు రక్షణ లేకుండా పోయిందని, ఇటీవల నేవీ రాడార్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జింకలు అడవిలో నుండి ఇతర ప్రాంతాలకు వస్తున్నాయన్నారు. ఈ కారణంగా కుక్కలు వెంటాడడంతో జింకలు మృతి చెందాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రభుత్వం కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అటవీ శాఖ వారు కానీ.. బాధ్యత వహిస్తాయా అని ఆయన ప్రశ్నించారు.