గెలుపు కోసం ముడుపు…

గెలుపు కోసం ముడుపు…
కొమురవెల్లి, ఆంధ్రప్రభ : కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election)ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాఫ్ రెడ్డి ఆదేశాల మేరకు అభిషేకం, పూజలు చేసి ముడుపు కట్టారు.
50 వేల మెజారిటీతో గెలువాలని పసుపు బండారి సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. గెలిచిన తరువాత మొట్టమొదటి సారి మల్లన్న స్వామి(Mallanna Swamy)ని దర్శించుకొని ముడుపు విప్పి మల్లన్న స్వామి దేవాలయం అభివృద్ధికి తోడ్పడి స్వామివారి కృపకు భాగస్వాములు అవుతామన్నారు.
ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీనివాస్(Mukund Srinivas) సిద్దిపేట జిల్లా డీసీసీ ఉపాధ్యకుడు, వజ్రోజు శంకరాచారి కొమురవెల్లి మాజీ డైరెక్టర్, కొమురవెల్లి మండల కార్యదర్శి వెంకీ కనకయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరపుల రాజు, ఉప్పల వంశీ, యేనిశెట్టి కిరణ్, మండల యూత్ కాంగ్రెస్ కొఆర్డినేటర్ కొయ్యడ ప్రశాంత్, గంధమాల కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.
