DEADLY CONTAINER : శవ మంటలు Andhra Prabha Spl Report

DEADLY CONTAINER : శవ మంటలు Andhra Prabha Spl Report
17 మంది బుగ్గి
ఆ కంటైనరే చంపేసి
కర్ణాటకలో గుండెల్ని పించేసిన విషాదం
( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

ఓ వైపు క్రిస్మస్ పండుగ వేళ.. బాలయేసుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు భక్తులు ప్రార్థనామందిరాల్లో బారులు తీరుతున్న వేళ.. కర్ణాటకలో మృత్యువు వికటట్టహాసం చేసింది. కంటైనర్ రూపంలో ( DEADLY CONTAINER ) ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ప్రయాణ బడలికతో ఆదమరచి నిద్ర పోతున్న 11 మందిని సజీవ దహనం (11 Burned Alive) చేసింది. ఈ ఘోరఖలి (Horrible Accident) సమాచారంతో యావత్ భారత దేశం దిగ్రాంతిని వ్యక్తం చేసింది. దేశ అధ్యక్షురాలు..దేశ ప్రధాని, కర్ణాటక సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

DEADLY CONTAINER : గుండెల్ని పిండేసిన ఘోరం
బెంగళూరు నుండి గోకర్ణ వైపు సీబర్డ్ (Seabird) ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సును (Sleeper Coach) కంటైనర్ ఢీకొట్టగానే డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులంతా ఆ సమయంలో నిద్రవస్థలో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినపడటంతో.. ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.

అప్పటికే కళ్ల ముందే కొంత మంది మంటల్లో కాలిపోతున్నారు. మంటలు అంటుకున్న ప్రయాణికులు బస్పు దూకి బయటపడ్డారు. ఆర్తనాదాలు, హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. గురువారం (డిసెంబర్ 25, 2025) తెల్లవారుజామున కర్ణాటకలోని చిత్రదుర్గ (Chitra Durga) జిల్లాలోని హిరియూర్ సమీపంలోని జాతీయ రహదారి 48పై సీబర్డ్ లగ్జరీ స్లీపర్ బస్సును తెల్లవారు జామున సుమారు 2:30 నుంచి 3:00 గంటల మధ్య బెంగళూరు వైపు వెళ్తున్న ఒక కంటైనర్ ట్రక్కు డివైడర్‌ను దాటి బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలి బుగ్గిగా మారాయి. సుమారు 21 మంది ( 21 Injured) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రి, బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ , క్లీనర్ ప్రాణాలతో బయట పడ్డారు. కంటైనర్ డ్రైవర్ , క్లీనర్ మృతి చెందారు. ప్రమాద స్థలికి తూర్పు జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవికాంతే గౌడ తమ పోలీసు సిబ్బందితో చేరుకున్నారు.
DEADLY CONTAINER : డీజిల్ ట్యాంకు పేలింది : ఐజీపీ రవికాంతే గౌడ

బెంగళూరు వైపు వెళ్తున్న ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టి, మరో లేన్‌లోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు బస్సును ఢీకొట్టింది, డీజిల్ ట్యాంక్‌ను (Desel Tank) ఢీకొట్టింది, దీనివల్ల మంటలు చెలరేగాయని పోలీసు అధికారి తెలిపారు. 5 మృతదేహాలు లభ్యమయ్యాయని, 3గ్గురు గుర్తింపు ఇంకా తెలియలేదని తూర్పు రేంజ్ ఐజీపీ బి.ఆర్. రవికాంతే గౌడ ( IGP Ravi Kante Goud) అన్నారు.

మృతులలో కంటైనర్ ట్రక్కు డ్రైవర్ (Contaner Driver Dead) కూడా ఉన్నాడు. అంతేకాకుండా, బస్సులో నాలుగు కాలి పోయిన మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. అయితే, మృతులెవరో ఇంకా నిర్ధారించబడలేదు. ఆచూకీ లభించని ముగ్గురు వ్యక్తులను మినహాయించి, అందరూ సురక్షితంగా ఉన్నారని, వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని గౌడ చెప్పారు. మృతుల వివరాలను డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా సేకరిస్తున్నారు.
DEADLY CONTAINER : ప్చ్ .. బస్సు ఆగలేదు : డ్రైవరు రఫీక్
ట్రక్కును చూసి కంగారు పడ్డాను. బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాను, కానీ ఎదురుగా వస్తున్న అతివేగ ట్రక్కును చూసి కంగారు పడ్డాను, బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాను. కానీ సాధ్యం కాలేదు అని సీబర్డ్ బస్సు డ్రైవరు రఫీక్ (Bus Driver Rafik) ఆవేదన వ్యక్తం చేశాడు.
“ట్రక్కు రోడ్డు డివైడర్‌కు అవతలి వైపు నుండి వచ్చి ఢీకొట్టింది. అది అతివేగంగా ఉంది. ఆ సమయంలో నేను 60- నుంచి 70 (కి.మీ/గం) వేగంతో బస్సు నడుపుతున్నాను. ముందు నుండి వస్తున్న వాహనం నాకు కనిపించింది. బస్సును ఢీకొన్న వాహనం (ట్రక్కు) మాత్రమే నాకు తెలుసు, ఆ తర్వాత ఏమి జరిగిందో, నన్ను ఎలా బయటకు తీసుకువచ్చారో నాకు తెలియదు, ”అని చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ రఫీక్ విలేకరులతో అన్నారు.
“ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూసి నేను బస్సును నియంత్రించడానికి ప్రయత్నించాను. నా బస్సు మా పక్కనే వెళ్తున్న మరో వాహనాన్ని కూడా తాకింది. అది ఏ వాహనమో నాకు తెలియదు. కానీ, (నియంత్రణ) చేయలేకపోయాను” అని ఆయన అన్నారు. బస్సు క్లీనర్ మహమ్మద్ సాదిక్ (Cleaner Sadik) కూడా స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో తాను బస్సు నుంచి బయటకు ఎగిరి పడినట్టు సాదిక్ తెలిపారు.
DEADLY CONTAINER : రాష్ట్రపతి ముర్ము సంతాపం

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) తన సంతాపాన్ని వ్యక్తం చేశారు మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
“కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన విషాదకరమైన బస్సు అగ్నిప్రమాదం ఘటన తీవ్ర దిగ్భ్రాంతి (Shock) కి గురిచేసింది, దీని ఫలితంగా ప్రాణనష్టం (Live Loss) జరిగింది. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను” అని ముర్ము Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
DEADLY CONTAINER : ప్రధాని దిగ్ర్బాంతి

ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹2 లక్షల ఎక్స్-గ్రేషియా (Ex Gratia) ప్రకటించారు. క్షతగాత్రులకు ₹50,000 ఆర్థిక సాయం ప్రకటించారు.
DEADLY CONTAINER : ఇది హృదయ విదారకం : కర్ణాటక సీఎం విచారం

చిత్రదుర్గలో గురువారం తెల్లవారుజామున జరిగిన ‘హృదయ విదారక’ బస్సు-ట్రక్కు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Cm Sidda Ramaiah) తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “చిత్రదుర్గ సమీపంలో లారీ, బస్సు మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారనే విషాద వార్త విని హృదయాలు వణికిపోయాయి” అని సీఎం సిద్ధరామయ్య Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు.
DEADLY CONTAINER : ఏపీ మంత్రులు విచారం

కర్ణాటక రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు (Ap Ministers) విచారం వ్యక్తం చేశారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రులు గురువారం (డిసెంబర్ 25, 2025) తీవ్ర దిగ్భ్రాంతి మరియు విచారం వ్యక్తం చేశారు.
ఈ సంఘటన చాలా బాధాకరమని, ముఖ్యంగా ప్రమాదం తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతో చాలా మంది సజీవ దహనం అయ్యారని వచ్చిన నివేదికలు చెబుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన తన సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద వార్త హృదయ విదారకంగా ఉందని అన్నారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
ALSO READ : Pligrimage Tragedy అంతలోనే ఆనందం ఆవిరి.. Andhra Prabha Detail Report
