గర్భగుడిలో మృతదేహం

ఏలూరులో కలకలం
ఏలూరు కార్పొరేషన్ : నవంబర్8 (ఆంధ్రప్రభ): ఏలూరు ఒకటో పట్టణ పరిధిలో తూర్పు వీధి షిరిడీ సాయిబాబా మందిరం గర్భగుడిలో మృతదేహం కలకలం రేపుతుంది. 9 వ డివిజన్ ఫిల్ హౌస్ పేటకు చెందిన డొల్ల లక్ష్మణరావు (65) సాయిబాబా మందిరంలో నైట్ వాచ్‌మెన్‌గా గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే నేపథ్యంలో శుక్రవారం రాత్రి విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆరోగ్య సమస్యతో కుప్పకూలి చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్ష్మణరావు మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
. అభిమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏలూరు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు.
