DDO Office | ప్రజల మంచి కోసమే..

DDO Office | ప్రజల మంచి కోసమే…

  • పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు
  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • గుడివాడలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

DDO Office | గుడివాడ, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మరింత మంచి చేసేందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతాయన్నారు. గుడివాడ పట్టణం పోస్ట్ ఆఫీస్ రోడ్డులో ఉన్న‌ ఆర్‌డ‌బ్ల్యూఎస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుడివాడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని(Divisional Development Officer’s Office) ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీడీఓ సునీత శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చిత్తూరులో జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎమ్మెల్యే రాము, అధికారులు తిలకించారు.

DDO Office

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.. నేడు పంచాయతీరాజ్ వ్యవస్థకు సుదినమన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా రాష్ట్ర వ్యాప్తంగా(across the state) 77 డీడీఓ కార్యాలయాలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మంచి చేసేందుకు అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.

DDO Office | ప్రజలకు మంచి చేసేలా పంచాయతీ రాజ్ వ్యవస్థ

ప్రజలకు మంచి చేసేలా పంచాయతీ రాజ్(Panchayat Raj) వ్యవస్థలో పెద్ద మార్పు తీసుకొస్తూ, నూతన ఒరవడి సృష్టించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

DDO Office

గుడివాడ డీడీఓ సునీత శర్మ మాట్లాడుతూ… ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకు(To Revenue Division Offices) సమాంతరంగా, పంచాయతీరాజ్ వ్యవస్థలను పర్యవేక్షించేలా డీడీఓ పోస్టులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. డీడీఓ కార్యాలయంతో పాటు ఆర్‌డ‌బ్ల్యూఎస్ భవనంలో ఏర్పాటు చేసిన డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి కార్యాలయం, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా(Assistant Project Director Dwama) కార్యాలయాలను గుడివాడ స్పెషల్ ఆఫీసర్ నరసింహులు ప్రారంభించారు.

DDO Office

ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, డీఎల్‌పీఓ సంపత్ కుమారి, మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్(Chatragadda Ravikumar), టీడీపీ గుడివాడ మండల అధ్యక్షుడు వాసే మురళి, గుడివాడ జెడ్పీటీసీ గోళ్ల రామకృష్ణ, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్(Gudivada Jones), టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, గుడివాడ ఎండీఓ విష్ణు ప్రసాద్, డివిజన్ పరిధిలోని ఆరు మండలాల ఎండీవోలు, ఏడు మండలాల డిప్యూటీ ఎండీవోలు, పంచాయతీరాజ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

click here to read Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

click here to read more

Leave a Reply