హోలీ సంబరాలలో పాల్గొన్న డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్

వికారాబాద్, ఆంధ్రప్రభ : హోలీ అందరి జీవితాల్లో రoగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని బిసిసిబి డైరెక్టర్ ఎన్ కిషన్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ తాండలో కాలనీవాసులతో కలిసి ఆయన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ అందరి జీవితాల్లో మంచి జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ సంప్రదాయంలో హోలీ పండుగకు విశిష్టత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జమున భాయ్ రవీందర్ నాయక్ పరశురాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply