విశాఖపట్నంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. హైదరాబాద్ కీలక బ్యాటర్లందరినీ సింగిల్ డిజిట్‌కే ఔట్ చేసి.. ఎస్‌ఆర్‌హెచ్ కు గట్టి దెబ్బకొట్టారు. ఢిల్లీ దెబ్బకి ఆరెంజ్ ఆర్మీ ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ ఐదు (5/35) వికెట్లతో అద్భుతంగా రాణించాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఐదోవర్లలోనే 37 పరుగులకే టాపార్డర్ కుప్పకూలింది. కీలక బ్యాటర్లు విఫలమై చోట.. చిచ్చరపిడుగు అనికేత్ వర్మ ఐపీఎల్‌లో తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. 41 బంతులు ఎదుర్కున్న అనికేత్ 5ఫోర్లు, 6 సిక్సులతో 74 పరుగులు సాధించాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32), ట్రావిస్ హెడ్ (12 బంతుల్లో 22) తప్ప, మరే ఇతర ఆటగాడూ రెండంకెల స్కోరు చేయలేదు.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో రాణించగా… కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 164 పరుగుల విజయలక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఛేజింగ్ ప్రారంభించనుంది.