నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ బౌలింగ్ అటాక్ కు ధీటుగా సమాదానమిస్తూ బౌండరీలు బాదింది.
తిలక్ వర్మ (33 బంతుల్లో 59) అర్థ శతకంతో చెలరేగాడు. తిలక్ వర్మతో పాటు ఓపెనర్ ర్యాన్ రికల్టన్ (25 బంతుల్లో 41), సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 40), నమన్ ధీర్ (17 బంతుల్లో 38 నాటౌట్) రాణించారు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీపై ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగలిగింది.
ఇక ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగ్గం, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 206 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది.