ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్ల విధ్వంసంతో ఢిల్లీ జట్టు ఘోరంగా ఓడిపోయింది. 200 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్.. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది.
ఓపెనర్లు సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108) సెంచీరతో విజృంభించాడు. మరోవైపు కెప్టెన్ శుభమన్ గిల్ సైతం (53 బంతుల్లో 93) దంచేశాడు. వీరిద్దరూ కలిసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో గుజరాత్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.