Dandepalli స‌స్య ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తులు పాటించాలి…

Dandepalli స‌స్య ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తులు పాటించాలి…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఉద్యానవన పంటల సాగులో సస్య రక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యానవన అధికారి అనిత సూచించారు. ఈ రోజు ఆమె మండలంలోని దండేపల్లి, లింగాపూర్(Dandepalli, Lingapur), మామిడిపల్లిలలో సాగుచేస్తున్న మామిడి తోటలను, కూరగాయల తోటలను, ఆయిల్ ఫామ్ తోటలను సందర్శించారు.

ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పంటలలో వచ్చే చీడ పీడల నివారణకు తీసుకోవలసిన మెలకువలు సస్యరక్షణ, తోటల్లో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులు వివరించారు. వివిధ కూరగాయల్లో చీడపీడల్లో సస్యరక్షణకు ఏ మందులు వాడుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఉద్యానవన పంటల్లో రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అందిస్తున్న వివిధ సబ్సిడీల వివరాలను రైతులకు వివరించి చెప్పారు. ఆమె వెంట డివిజనల్ ఉద్యానవన అధికారి కందుల సహజ, ఆయిల్ఫామ్ అధికారి మల్లేష్(Oil Farm Officer Mallesh), రైతు కొండు సత్తయ్య, రైతులు ఉన్నారు.

Leave a Reply