గుస్సాడి సంస్కృతికి అద్దంప‌ట్టిన దండారి

గుస్సాడి సంస్కృతికి అద్దంప‌ట్టిన దండారి

ఉట్నూర్, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని గుస్సాడి సంస్కృతికి అద్దం ప‌ట్టేలా దండారి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మార‌న్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ ఆధ్వర్యంలో నాలుగు గ్రామాలకు చెందిన గుస్సాడీ, దండారి, కోలాటాల‌తో గుస్సాడీ దండారి మహోత్సవాలు ఈ రోజు ఘనంగా జరిగాయి.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సొంత ఖర్చులతో ఆదివాసుల అతి పెద్ద పండుగ అయిన దీపావళి సందర్భంగా ఈ వేడుకలను నిర్వ‌హించారు. గుస్సాడీ కోలాటం నృత్యాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆయన తనయుడు తనీష్ పటేల్ సంప్ర‌దాయంగా కోలాటం ఆడి అందరినీ అల‌రింప‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ ఆదివాసుల అతి పెద్ద పండుగ అయిన దీపావళి వారం రోజుల ముందు జరిగే గుస్సాడీ దండారి సంబరాలను భావ్య ప్రపంచానికి చాటి చెప్పేందుకు సంస్కృతిని దండారి ఆచారాలను గిన్నిస్ బుక్ రికార్డులలో ఎక్కించడమే తన లక్ష్యమని అన్నారు.

ఆదివాసీలు నిర్వహించే గుస్సాడీ బృందాల సంస్కృతి విషయం గురించి సంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి గుస్సాడి సంస్కృతిని గిన్నిస్ రికార్డులు ఎక్కించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఏజెన్సీలో వెయ్యి గుస్తాడి బృందాలు ఉన్నాయని, ఒక్కొక్క గుస్సాడీ బృందానికి 1500 చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశార‌ని, గుస్సాడీ సంబరాలకు కోటి యాభై లక్షల రూపాయలు విచిస్తున్నారని ఆయన అన్నారు.

గుస్సాడీ దండారి మహోత్సవాల్లో ఎమ్మెల్యే సొంత గ్రామమైన కల్లూరిగూడ, తో పాటు దుర్గాపూర్ రాజంపేట టక్కు గూడ గ్రామాలకు చెందిన గుస్సాడీ దండారి బృందాలు పాల్గొని ప్రదర్శనలు చేశారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నాయకులు, గ్రామ పటేళ్లు, ఆదివాసీలు పాల్గొని వేడుకలను తిలకించారు.

Leave a Reply