Daboia | వలకు చిక్కిన రక్త పింజరి

Daboia | వలకు చిక్కిన రక్త పింజరి
Daboia | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ మండలం (Gudivada Mandal) గుంటాకోడూరులో శనివారం రక్త పింజరి (Daboia) వలలో చిక్కుకోవడం కలకలం రేపింది. మోటారు బావుల వద్దకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఉచ్చులో ఇది చిక్కుకుంది. వింత శబ్దాలు రావడంతో స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారుల (Forest officials) కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆ రక్తపింజరిని సురక్షితంగా బయటకు తీసి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
