Cyber crime | 8 లక్షలు స్వాహా..

Cyber crime | 8 లక్షలు స్వాహా..

Cyber crime, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పోలీసులు (Police) సైబర్ నేరాల పట్ల ప్రజలను ఎంత అప్రమత్తం చేస్తున్నా.. ఏదో ఒక మూలన సైబర్ క్రైమ్ బారిన పడి నష్టపోతూనే ఉన్నారు. అత్యాశతో కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాలకు ధారదత్తం చేస్తున్నారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్లో నివాసముంటున్న ఓ సాఫ్ట్ వేర్ మహిళ సైబర్ మోసగాళ్ల బారినపడి దాదాపు 8 లక్షల 15 వేల రూపాయలు పోగొట్టుకుంది. ఆ మహిళ మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply