Current wire | విద్యుత్ షాక్‌తో వ్య‌క్తి మృతి

Current wire | విద్యుత్ షాక్‌తో వ్య‌క్తి మృతి

Current wire | కోడూరు, ఆంధ్రప్రభ : విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందిన సంఘటన కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామంలో చోటుచేసుకుంది. కోడూరు ఎస్సై చాణిక్య తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బడే పిచ్చేశ్వరరావు (54) బుధవారం రాత్రి ఆక్వా చెరువు వద్ద పనిచేస్తున్న క్రమంలో ఎడమ చేతికి క‌రెంట్ వైరు(Current wire) తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

గురువారం మృతుని కుమారుడు బడే గోపీనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామ‌ని ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం(postmortem) అనంతరం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.

Leave a Reply