ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు..

ఏపీలో తగ్గనున్న కరెంట్ బిల్లులు..

ఏపీలోని అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చౌడువాడ, కింతలిలో బుధవారం నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాలను ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవి కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో ఈ నెల నుంచి కరెంట్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయంలో బిల్లుల్లో ఎఫ్ పీపీపీ చార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేసి పేదలను ఇబ్బంది పెట్టారని.. ఈ నెల నుంచి 13 పైసలు తగ్గిస్తుండడంతో వినియోగదారులకు మేలు జరుగుతుందని తెలియచేశారు.

11 జిల్లాల్లో రూ. 250 కోట్ల వ్యయంతో 69 కొత్త విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లుగా తెలియచేశారు. దీంతో పాటు, రాష్ట్రంలోని 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్ల పై ఉచితంగా సౌరవిద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విద్యుదాఘాతానికి గురై మరణించిన ఇద్దరి కుటుంబ సభ్యులకు మంత్రి గొట్టిపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

Leave a Reply