CSK vs RCB | ప‌టీద‌ర్ కెప్టెన్ ఇన్నింగ్స్ !

చెన్నై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు సీఎస్కే – ఆర్సీబీ మ‌ధ్య‌ జ‌రుగున్న‌ రసవత్తర పోరులో.. బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీద‌ర్ దంచికొట్టాడు.

ఆర్సీబీ కీల‌క వికెట్లు కోల్పోయిన క్ర‌మంలో.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు బెంగ‌ళూరు న‌యా సార‌ది. చెన్నై బౌల‌ర్ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కుంటూ.. అదిరే హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 32 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సుల‌తో 51 ప‌రుగులు సాధించాడు. అయితే, 18.1 ఓవర్లో పతిరాణా బౌలింగ్ ఔటయ్యి వెనుదిరిగాడు రజత్ పటీదర్.

కాగా, ప్ర‌స్తుతం క్రీజులో టిమ్ డేవిడ్ – భువనేశ్వర్ ఉన్నారు. 19 ఓవ‌ర్ల‌కు ఆర్సీబీ స్కోర్ 177/7

Leave a Reply