CSK vs MI | రాణించిన చెన్నై బౌల‌ర్లు.. త‌క్కువ ప‌రుగుల‌కే ముంబై క‌ట్ట‌డి !

చిదంబరం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ – ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య జ‌రుగుత‌న్న మ్యాచ్ లో సీఎస్కే బౌల‌ర్లు చెల‌రేగారు. నూర్ అహ్మ‌ద్ (4/18), ఖ‌లీల్ అహ్మ‌ద్ (3/29) ముంబై బ్యాట‌ర్ల‌ను బెంబేలెత్తించారు. దీంతో ముంబై జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు న‌ష్ట‌పోయి 155 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఎంఐ బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ (31), కెప్టెన్ సూర్య కుమార్ (29), దీప‌క్ చాహ‌ర్ (28), న‌మ‌న్ ధీన్ (17) ప‌రుగులు సాధించారు. మిగిలిన‌వారు అంత‌గా రాణించ‌లేక‌పోయారు. ఇక సీఎస్కే బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్ నాలుగు వికెట్లు తీయ‌గా.. ఖ‌లీల్ అహ్మ‌ద్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక నాథన్ ఎల్లిస్, అశ్విన్ త‌లా ఒక వికెట్ ద‌క్కించుకున్నారు.

దీంతో చెన్నై జట్టు 156 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగ‌నుంది.

Leave a Reply