Praja Durbar | పోటెత్తిన జనం..

Praja Durbar | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రి పయ్యావుల కేశవ నిర్వహించిన ప్రజా దర్బార్ కు జనం పోటెత్తారు. ఉరవకొండ పట్టణంలో రెండవ రోజు ప్రజా దర్బార్ కొనసాగింది. ప్రతి సోమవారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా ఫిర్యాదుల(Public complaints) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో జిల్లా అధికారులతో(with the authorities) మొదలుకొని గ్రామస్థాయి అధికారుల వరకు పాల్గొంటున్నారు.
అయినప్పటికీ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) కు తమ సమస్యలను తెలియజేయడానికి పోటాపోటీగా జనం వచ్చారు. ముస్లిం మహిళలు మొదలుకొని ఇతర సామాజిక వర్గాల(Other social groups)కు సంబంధించిన వారు ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. వ్యక్తిగత సమస్యలు భూ సమస్యల పై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే.. మంత్రి తమ సమస్యలను(problems) పరిష్కరిస్తారన్న భరోసాతోనే ప్రజలు పెద్ద సంఖ్యలో అర్జీలు పట్టుకుని వస్తున్నారని స్థానికులు తెలిపారు.
