Tirupathi | తిరుమల కొండ.. భక్తుల కిటకిట

Tirupathi | తిరుమల కొండ.. భక్తుల కిటకిట

Tirupathi | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. నిత్యం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. గతంలో వేసవి సెలవుల్లో ఎక్కువగా వచ్చేవారు. ఇప్పుడు అవేవి చూసుకోకుండా ప్రతీ రోజు భక్తులు విచ్చేస్తున్నారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు విక్రయిస్తుండటంతో పాటు ఎప్పటికప్పుడు ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు సంఖ్యకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 8గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల్లో పూర్తవుతుంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న(మంగళవారం) తిరుమల శ్రీవారిని 77,049 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,469 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
