పంటనష్టం అంచ‌నా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్

పంటనష్టం అంచ‌నా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్

ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు (ఎన్యుమరేషన్) ప్రక్రియపై కొన్ని సామాజిక మాధ్యమాలలో వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించవు కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ(Krishna District Collector Balaji) అన్నారు. కృష్ణా జిల్లాలో పంట నష్టం లెక్కింపు కార్యక్రమం గత ఏడు రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. అక్టోబర్ 29న మోంథా తుఫాన్ తీరం దాటిన వెంటనే, పంట నష్టం ప్రాథమిక అంచనాలు ప్రారంభమయ్యాయి.

ఆ తరువాత అన్ని ప్రభావిత మండలాల్లో విస్తృతంగా గ్రామ స్థాయి పరిశీలన లెక్కింపు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు. అవసరమైన సమాచారం ఇప్పటికే ధృవీకరించిన రికార్డుల(verified records) నుండి స్వయంచాలకంగా పొందుతున్నామని, పొరపాటున ఈ-క్రాప్ లో నమోదు కానటువంటి పొలాలను కూడా లెక్కించినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. లెక్కింపు, సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్), ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం వంటి కార్యక్రమాలు సమన్వయంతో జరుగుతున్నాయి.

తద్వారా మొత్తం ప్రక్రియను తప్పులకు తావు లేకుండా పూర్తి చేయడం జరుగుతోంది. గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ ఉద్యాన సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు సహా అన్ని స్థాయి సిబ్బంది నిరంతరంగా క్షేత్ర స్థాయిలో లెక్కింపు కార్యక్రమాన్ని చిత్తశుద్ధి తో నిర్వర్తిస్తున్నారు. నవంబర్ 5 నాటికి కూడా కొన్ని మండలాలో లెక్కింపు కొనసాగుతుండగా, ప్రతి ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేసేలా చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ బాలాజీ వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లెక్కింపు ప్రక్రియ నిర్వహించబడుతోంది.

అన్ని వివరాలు APAIMS మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో నమోదు అవుతున్నాయి. ఈ యాప్ ఈ-క్రాప్ నమోదు వ్యవస్థతో అనుసంధానించబడినందున, ఖచ్చితమైన, పారదర్శకమైన డేటా సేకరణ(collection of data) జరుగుతోంది. రైతులు ఎటువంటి అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవసరమైన సమాచారం ఇప్పటికే ధృవీకరించిన రికార్డుల నుండి స్వయంచాలకంగా పొందబడుతోంది. పొరపాటున ఈ-క్రాప్ లో నమోదు కానటువంటి పొలాలను కూడా లెక్కింపు చెయ్యడం జరుగుతోంది.

లెక్కింపు, సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్), ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం వంటి కార్యక్రమాలు సమన్వయంతో జరుగుతున్నాయి, తద్వారా మొత్తం ప్రక్రియ(process)ను తప్పులకు తావు లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది.

ఇంకా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమిటంటే, పంట నష్టం లెక్కింపు ప్రక్రియ ధాన్యం(process grain) కొనుగోలు కార్యక్రమంతో పూర్తిగా సంబంధంలేనిది. ప్రభుత్వం అన్ని రైతుల నుండి ధాన్యం కొనుగోలు నిరభ్యంతరంగా కొనసాగిస్తుంది

ఇంకా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమిటంటే, పంట నష్టం లెక్కింపు ప్రక్రియ ధాన్యం కొనుగోలు కార్యక్రమంతో పూర్తిగా సంబంధంలేనిది. ప్రభుత్వం(Govt) అన్ని రైతుల నుండి ధాన్యం కొనుగోలు నిరభ్యంతరంగా కొనసాగిస్తుంది. లెక్కింపు ద్వారా పొందిన సమాచారం కేవలం ఇన్పుట్ సబ్సిడీ అర్హత నిర్ణయానికి మాత్రమే వినియోగించబడుతుంది.

Leave a Reply