CRIME | ఏమైందో..? ఏమో..?

CRIME | ఏమైందో..? ఏమో..?

  • మ‌రికొద్ది గంట‌ల్లో పెళ్లి అన‌గా యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

CRIME | విజయనగరం క్రైమ్, ఆంధ్రప్రభ : ఏం జరిగిందో.. తెలియదు.. మరి కొద్ది గంటలలో సింహాద్రి అప్పన్న సన్నిధిలో వివాహం (Marriage) చేసుకోవలసిన యువకుడు గురువారం అర్ధరాత్రి తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం దాసన్నపేట గొల్ల వీధికి చెందిన కోరాడ వీరేంద్ర (27) నగరంలో ఓ వస్త్ర దుకాణంలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మృతుడు వీరేంద్ర గత కొంతకాలంగా గోషాసుపత్రి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరికీ సింహాచలం దేవస్థానంలో శుక్రవారం ఉదయం వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు.

గురువారం రాత్రి 11 గంటల వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న వీరేంద్ర (Veerendra) మేడపై ఉండే గదిలో పడుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. తెల్లవారితే పెళ్లి పీటలెక్కాల్సిన వీరేంద్రకు, ప్రియురాలికి మధ్య ఫోన్‌లో ఏం గొడవ జరిగిందో తెలియదు.. వీరేంద్ర ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి పీటలెక్కాల్సిన తమ కుమారుడు పాడె ఎక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అంటూ మృతుడు తల్లిదండ్రులు శ్రీను, దేశాలు బోరున విలపించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply