Cricketer | బాల పురస్కారం అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Cricketer | ఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో రంజీ ట్రోఫీ సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన బిహార్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) అతడికి ఈ అవార్డును ప్రదానం చేశారు.
దేశవ్యాప్తంగా బాలల్లో అసాధారణ ప్రతిభ, సాహసం, సేవా భావాన్ని ప్రదర్శించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం (Prestigious award) ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)ను వైభవ్ సాధించడం ఆనందదాయకం. క్రీడల రంగంలో ఈ పురస్కారం అందుకున్న వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు మరింత బలం చేకూర్చే నక్షత్రంగా ఎదగనున్నాడని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపినందుకు వైభవ్‌కు ఈ గౌరవం దక్కింది.

