Cricket | హెచ్‌సీఏ క‌మిటీని ర‌ద్దు చేసి ఎన్నిక‌లు జ‌ర‌పాలి – అజారుద్దీన్ డిమాండ్

హైద‌రాబాద్ – అవినీతి ఊబిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్ర‌స్తుత క‌మిటిని ర‌ద్దు చేసి వెంట‌నే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్. ఉచిత ఐపీఎల్ టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఫ్రాంచైజీని బెదిరించారనే ఆరోపణలతో పాటు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసుల్లో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

దీనిపై నేడు మీడియాతో అజారుద్దీన్ మాట్లాడుతూ, హెచ్‌సీఏ అధ్యక్షుడి అరెస్ట్ ఆ సంస్థకే పెద్ద అవమానమని అన్నారు. ఐపీఎల్ టికెట్ల విషయంలో అదనపు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, అందుకు ఒప్పుకోకపోతే వేధించడం దారుణమని అన్నారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి ఆటపై దృష్టి సారించాలని ప్రస్తుత సభ్యులకు ఆయన సూచించారు. అవకాశం వస్తే హెచ్‌సీఏ బాధ్యతలను మళ్లీ స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అజారుద్దీన్ ప్రకటించారు.

Leave a Reply